16-07-2025 10:16:25 PM
మల్లంపల్లి మండల కేంద్రంలో విహెచ్పిఎస్ అత్యవసర సమావేశం
వికలాంగులకు 6వేలు పెన్షన్ ఇవ్వాలి
కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయాలి
ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు చాతల్లా రమేష్ మాదిగ, మడిపెల్లి శ్యామ్ బాబు మాదిగ
మల్లంపల్లి,(విజయక్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో బుధవారం విహెచ్పిఎస్ మండల కమిటీ అత్యవసర సమావేశం జరిగింది.ఈ సమావేశానికి విహెచ్పిఎస్ మండల నాయకులు బొమ్మన రాజయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా చాతల రమేష్ మాదిగ,మడిపెల్లి శ్యామ్ బాబు మాదిగ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం వికలాంగులకు 6 వేలు, వృద్దులు, వితంతువులు 4 వేలు పెన్షన్ ఇవ్వాలని వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల విషయంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పట్టించుకోవడం లేదన్నారు. వికలాంగులను,ఆసరా పెన్షన్ దారులను ఏకం చేసి ఆగస్టు 13న ఎల్బి స్టేడియంలో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు,ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.