calender_icon.png 16 July, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యర్థులే.. శత్రువులు కారు

16-07-2025 01:10:35 AM

- వ్యక్తిగత దూషణలు సరికాదు

- నేతలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

కోదాడ, జూలై 15: ప్రతిపక్షాల నేతలు ప్రత్యర్థులే కానీ శత్రువులు కారని, వారిపై వ్యక్తిగత దూషణ సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు తమ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేశానని, నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటమే నాయకత్వ లక్షణం అని చెప్పారు. దూకుడుగా వ్యవహరించటం అంటే బూతులు మాట్లాడటం, వివాదాలు సృష్టించటం, దాడులు చేయటం సరికాదని చెప్పారు. రాజకీయ నేతలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నారు.

మ పార్టీ తమకు అదే నేర్పిందని పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే స్థాయికి బీజేపీ ఎదిగిందని, స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటుతామని చెప్పారు. ఎన్నికలలో ధన ప్రవాహం నిలువరించబడితేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని.. ఈ అంశంపై ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరారు. సమాజంలో జరుగుతున్న అంశాలలో సామాజిక మాధ్యమాల దుష్ప్రభావంతో ఏది వాస్తవమో తెలుసుకునే పరిస్థితి లేదన్నారు.

సామాజిక మాధ్యమాలు స్వీయ నియంత్రణ పాటించి, వాస్తవాలను ప్రజలకు స్పష్టీకరించాలని హితవు పలికారు. 2014 నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ విద్య, వైద్య, రక్షణ ఆర్థిక సాంకేతిక రంగాల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి దశకు చేరి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో రహదారుల విస్తరణ శరవేగంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో 13 జాతీయ రహదారులు వందల కోట్లతో నిర్మాణం జరిగిందన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇతర దేశాల ఎదుటచేయి చాచాల్సిన దుస్థితి ఉండేదని ఇప్పుడు బీజేపీ పాలనలో మనమే పేద దేశాలకు అన్ని రంగాలలో సహాయం చేస్తున్నామన్నారు. 56 దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత మన దేశానికి దక్కుతుందన్నారు. 2047 కల్లా భారతదేశ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాంచందర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, పాండురంగారావుతో పాటు పలు అసోసియేషన్ల బాధ్యులు రాంచందర్‌రావును ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో డాక్టర్ జాస్తి సుబ్బారావు, డీజేపీ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, చల్లా శ్రీలతరెడ్డి, బండారు కవితారెడ్డి, అక్కిరాజు యశ్వంత్, వెంకటరామయ్య, జుట్టుకుండ సత్యనారాయణ, నూనె సులోచన, కనగాల నారాయణ, నాగాచారి, డాక్టర్ రంగాచారి, డాక్టర్ రాఘవరావు, బొలిశెట్టి కృష్ణయ్య, కిట్టు న్యాయవాది, ఎస్‌ఆర్ కె మూర్తి, మేకల వెంకట్రావు, నీల సత్యనారాయణ, పందిరి నాగిరెడ్డి, సైదేశ్వరరావు, చెన్నకేశవరావు పాల్గొన్నారు