దేవుడితోడు.. ఈసారి ఓటు వేయం
09-05-2024 03:04 AM
గరిమెళ్లపాడు గ్రామస్థుల ప్రతిన
భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (విజయక్రాంతి): ప్రతి ఎన్నికలోనూ రాజకీయ నాయకులు తమను మోసం చేస్తున్నారని, ఈ సారి ఎవరికీ ఓటేసేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని గరిమెళ్లపాడు గ్రామస్థులు ప్రతిన బూనారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ‘దేవుడితోడు ఓటు వేసేది లేదు’ అని ఫ్లెక్సీ ఏర్పాటుచేసి తమ నిరసనను తెలిపారు. బుధవారం గ్రామంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. గరిమెళ్లపాడులో మొత్తం 300 గిరిజన కుటుంబాలు ఉంటాయి. సుమారు 250 ఓట్లు ఉంటాయని గ్రామస్థులు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని భీష్మించుకొని కూర్చున్నారు.






