అధికారంలోకి వస్తే ఉపాధి కూలి 400
09-05-2024 03:05 AM
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
ఆదిలాబాద్, మే 8 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీల వేతనం రోజుకు రూ.400కు పెంచుతామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం బాబాపూర్‌లో బుధవారం ఆమె పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగణతో కలిసి ఉపాధి కూలీలతో మాట్లాడారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని పిలుపునిచ్చారు. ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఆత్రం సుగణ ఎన్నికల్లో గెలిస్తే ప్రతి గ్రామానికి బడి, గుడి వస్తుందన్నారు. ప్రచారంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.






