29-01-2026 12:00:00 AM
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): మహంకాళి అమ్మవారి ఆశీస్సుల తో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. బుధవారం రాంగోపాల్ పేట లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నేటి నుండి 5 రోజుల పాటు నిర్వహించే కుంకుమార్చన పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు.
ముందుగా మహంకాళి అమ్మవారి ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యా దవ్ దంపతులు చీరలను పంపిణీ చేశారు. ఆలయ ఈవో మహేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్ తదితరులు ఉన్నారు.
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధ వారం సికింద్రాబాద్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, అమీర్ పేట తహసీల్దార్ కార్యాలయాల పరిధిలోని 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి, హేమలత, నామ న శేషుకుమారి పాల్గొన్నారు.