29-01-2026 12:00:00 AM
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ జనవరి 28 (విజయక్రాంతి): వేములవాడ మున్సిపల్ 28 వార్డుకు చెందిన గోపన్నగారి మాధవి లత బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని విప్ సూచించారు. గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని విస్మరించిందని అన్నారు.. వేములవాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.