calender_icon.png 29 January, 2026 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి రోజు నామినేషన్ల జోష్

29-01-2026 12:00:00 AM

కరింనగర్, జనవరి28(విజయక్రాంతి): కరింనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 మున్సిపాలిటీ లు రెండు కార్పొరేషన్ లలో మొదటి రోజు భారీ గా నామినేషన్లు దాఖలైనాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ లో మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యవేక్షణ లో పోలీస్ బందోబస్తు మద్య ప్రశాంతంగా ముగిసింది.

నగరంలోని మొత్తం 66 డివిజన్లకు సంబంధించి 33 నామినేషన్ కౌంటర్లలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించి... ఎన్నికల సంఘం రూపొందించిన ఆన్ లైన్ టి పోల్ వెబ్ సైట్ లో వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరిచారు. మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొత్తం 76 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా 66 డివిజన్ల లో మొత్త 80 నామినేషన్లు రావడం జరిగింది. ఇందులోఆప్ పార్టీ 1, బిఎస్ పి 1, బీజేపీ 32, సిపిఐ ఎం 0, ఐఎన్ సి 25, ఏఐఎంఐఎం 3, బిఆర్‌ఎస్ 13, టిడిపి 0, వైఎస్ ఆర్ సి 0, టీజిఎస్‌ఈసి 1, ఇండిపెండెంట్ 4, మొత్తం 80 నామినేషన్లు దాఖలయినాయి

జగిత్యాల జిల్లాలో

మొదటి రోజు ప్రశాంతంగా జరిగిన నామినేషన్ ప్రక్రియ జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు 64 నామినేషన్ లు వచ్చినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ తెలిపారు.

ధర్మపురి 10 

జగిత్యాల21

కోరుట్ల 07

మెట్ పెల్లి 17

రాయికల్ 9

మొత్తం 64 నామినేషన్ లు దాఖలైనాయి.