calender_icon.png 12 July, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్

07-08-2024 03:40:11 PM

న్యూఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 9 రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగానున్నాయి. రాజ్యసభ నుంచి లోక్ సభకు 10 మంది సభ్యులు ఎన్నికవడంతో ఖాళీ అయిన 10 సీట్లతోపాటు 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో రాజ్యసభ ఎంపీ పదవికి కె.కేశవరావు రాజీనామా చేయగా, ఇలా తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు రాజీనామా చేశారు. 12 రాజ్యసభ స్థానాలకు ఆగస్టు 14న ఈసీ నోటిఫికేషన్ విడదల చేసి, నామినేషన్ల దాఖలకు ఈనెల 21వ తేదీ తుదిగడువుగా ప్రకటించింది. సెప్టెంబర్ 3న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీంగ్ నిర్వహించి, అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుపుతారు.