10-05-2025 02:18:16 AM
న్యూఢిల్లీ, మే 9: దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలను వాయిదా వేశారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఐఏ) ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియెట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని.. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఐసీఐఏ ప్రకటించింది.
గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్షలు మే 3, 5, 7 తేదీల్లో జరగాల్సి ఉండగా.. గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. గ్రూప్ 1 తుది పరీక్ష మే 2, 4, 6 తేదీలలో నిర్వహించగా.. గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగనున్నాయి.