10-05-2025 11:29:20 AM
న్యూఢిల్లీ: భారత్ పాకిస్థాన్ పై ప్రారంభించిన 'ఆపరేషన్ సిందూర్'ప్రభావం ఆపరేషన్ కగార్ పై పడింది. కేంద్రం కర్రెగుట్ట నుంచి సీఆర్ పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పించింది. కర్రెగుట్టల నుంచి దశలవారీగా బలగాలను వెనక్కి రప్పిస్తోంది. సీఆర్పీఎఫ్ జవాన్లు హెడ్ క్వార్టర్స్ చేరుకోవాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. రేపు ఉదయంలోపు సీఆర్పీఎఫ్ బలగాలు సరిహద్దుల్లోకి వెళ్లనున్నాయి. కగార్ ఆపరేషన్ ఛత్తీస్ గఢ్ వైపు యథావిధిగా కొనసాగనుంది.