10-05-2025 01:28:23 AM
ఉదయం 11 గంటలకు విడుదల
హైదరాబాద్, మే ౯ (విజయక్రాంతి): తెలంగాణ ఎప్‌సెట్ ఫలితా లను ఆదివారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదలచేయనున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,07,190 (94శాతం) మంది పరీక్షలకు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 86,762 మంది పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోగా 81,198 (93.59శాతం) మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.