10-05-2025 02:41:09 AM
న్యూఢిల్లీ, మే 9: 18వ ఐపీఎల్ సీజన్ వాయిదా పడింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టోర్నీని వారంపాటు వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనేక ఫ్రాంచైజీలు తమ జట్ల ఆటగాళ్ల భద్రతపై ఆం దోళన వ్యక్తం చేశాయి. దీనిపై ఐపీఎల్ పాలకమండలిలో సైతం చర్చ జరిగింది. ప్రసారకర్తలు, స్పాన్స ర్లు, అభిమానుల అభిప్రాయాలను పరిగణనలో కి తీసుకొని టోర్నీని వాయి దా వేశారు
. ‘మన సాయుధ బలగాల స్థుర్యైం, సన్నద్ధతపై మాకు పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ.. అం దరి అభిప్రాయాలను గౌరవించి, ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి బీసీసీఐ పూర్తి మద్దతి స్తోంది. మన సాయుధ బలగాల ధైర్యం, నిస్వార్థ సేవలకు సెల్యూట్ చేస్తున్నాం’ అని ఐపీఎల్ తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
ఇప్పటికే భద్రత కారణంగా పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దయిన విష యం తెలిసిందే. శుక్రవారం లక్నో మధ్య లక్నోలోని ఏకనా స్టేడియం లో మ్యాచ్ జరగాల్సి ఉండగా, వారం పాటు వాయిదా వేస్తూ ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కాగా సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లతో పా టు రెండు క్వాలిఫయర్లు, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి.