calender_icon.png 10 May, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ అమ్మకాలు...

10-05-2025 12:50:24 PM

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులు...

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ అమ్మకాలు(Cool drinks Sales ) చేస్తూ పలువురు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. పట్టణంలోని ఓ కిరాణ దుకాణంలో కాలం చెల్లిన కూల్ డ్రింక్‌లు అమ్ముతున్న విషయం బయటకు పొక్కడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని గోదావరి రోడ్డులో ఒక ప్రముఖ వ్యాపారి కిరాణ షాప్‌లో ఓ విక్రయదారుడు శుక్రవారం సాయంత్రం మజా కొనుగోలు చేసి చిన్నపిల్లలకు తాగిపించాడు. అది తాగిన పిల్లలు పది నిమిషాలకే వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు తీరా చూస్తే ఔట్‌ డేటేడ్ (Outdated) బాటిల్ లోని రసం తాగడం వల్లనే పిల్లలకు వాంతులు జరిగాయని తెలుసుకున్నారు. షాప్ యజమానిని నిలదీయడంతో విషయాన్ని దాటవేసేందుకు ప్రయత్నించాడు. 

పోలీసులు రాకతో మారిన సీన్...

షాపు యజమాని నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో అభిప్రాయదారుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. గడు ముగిసిన పానీయాలను తక్కువ ధరకు తీసుకొచ్చి ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ప్రజలు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. కూల్ డ్రింక్స్ ఎక్స్పైరీ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పట్టణంలో ఇలాంటి ఔట్ డేటెడ్ కూల్ డ్రింక్‌లను కిరాణా షాప్‌లలో చౌక బేరాలకు హోల్ సేల్ వ్యాపారులు వేస్తున్నారని, గడువు ముగిసిన శీతల పానీయాలు అమ్మడమే కాకుండా ఒక్కో బాటిల్ పై కూలింగ్ చార్జి పేరిట అదనంగా కస్టమర్‌ల వద్ద రూ. 5 ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ డ్రింక్స్‌ని చిన్న పిల్లలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కాబట్టి కాలం చెల్లిన కూడా వీటినే మార్కెట్‌లో క్రయ, విక్రయాలను జరుపుతూ దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పోలీసులు విచారణ జరిపి ఎక్స్పైరీ కూల్ డ్రింక్స్ తక్కువ ధరకు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హోల్ సేల్ షాపులలో తనిఖీలు చేస్తే మరిన్ని బయటకు వచ్చే అవకాశాలను ఉన్నాయని, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పట్టించుకోని అధికారులు...

లక్షెట్టిపేట పట్టణంలో ధనార్జన ధ్యేయంగా వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వేసవిలో ఎక్కువ సేవించే శీతలపానియాలైన మాజా, పల్పీ ఆరంజ్, అప్పి ఫిజ్, థమ్సఫ్, మజా, కోక్ వంటి డ్రింక్స్‌ని కాలం చెల్లినవి తీసుకువచ్చి ప్రజలకు అంటగడుతున్నారు. ఇలా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం జరుపుతున్నారు. సంబంధిత శాఖ అధికారుల తనిఖీలు ఏమాత్రం లేకపోవడంతో మీరు వ్యాపారం జోరుగా సాగుతోంది. ఔట్ డేటెడ్ అయిన డ్రింక్స్‌ని ఒక కాటన్‌కి బదులు రెండు కాటన్‌లు వేస్తూ డీలర్ షిప్ వాళ్ళు, కిరాణా షాపు యజమానులతో చేతులు కలిపి కస్టమర్‌లని దోచేస్తున్నారని, వెంటనే మండలంలో సంబంధిత అధికారులు స్పందించి దాడులు నిర్వహించి కాలం చెల్లిన డ్రింక్స్‌ని మార్కెట్‌లోకి రాకుండా చూడాలని కోరుతున్నారు.