5 May, 2026 | 5:20 AM

చిరుత దాడిలో లేగదూడ మృతి

10-12-2024 01:42 AM

కామారెడ్డి జిల్లాలో కలకలం

కామారెడ్డి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు చిమ్మ సత్యనారాయణ ఆదివారం సాయంత్రం తన వ్యవసా య భూమిలోనే లేగదూడను కట్టివేసి ఇంటి కి వచ్చాడు. సోమవారం ఉదయం పొలానికి వెళ్లే సరికి అక్కడ దూడ కనిపించలేదు.

చుట్టుపక్కల వెతకగా అటవీప్రాంతంలో మృతిచెందిన దూడ అనవాళ్లు లభించాయి. వెంటనే రైతు సమాచారం ఇవ్వగా అటవీశాఖ అధికారులతోపాటు పశువైద్యాధికా రులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనా మా నిర్వహించారు. చిరుత దాడిలోనే లేగదూడ మృతిచెందినట్లు వారు నిర్ధారించారు. చిరుత సంచరిస్తుందన్న విషయం తెలియడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.