calender_icon.png 27 October, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో క్యాంపస్ టు కార్పొరేట్ కనెక్ట్ వర్క్‌షాప్

27-10-2025 01:21:42 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలోని ఎంసిఎ క్లబ్ స్టూడెంట్ చాప్టర్  సహకారంతో ఎంసిఎ విద్యార్థుల కోసం క్యాంపస్ టు కార్పొరేట్ కనెక్ట్ అనే  2రోజుల వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించింది. ఈ వర్క్‌షాప్ లక్ష్యం విద్యార్థులను కార్పొరేట్ ప్రపంచానికి సిద్ధం చేయడం,

అలాగే నేర్చుకునే ప్రక్రియను సరదా కార్యక్రమాలతో కలపడం. ఈవర్క్‌షాప్ స్పీకర్ పి. రామ్ మనోజ్ , ఐటి శాఖ హెచ్‌ఓడి డాక్టర్ నితీషా శర్మ , ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి. శేఖర్ రెడ్డి, ఎల్. ఆనంద్ బాబు క్లాస్ ఇన్ఛార్జ్ పి .రమేష్ బాబు  పాల్గొన్నారు. దాదాపు 200 మంది ఎంసిఎ విద్యార్థులు ఈకార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు.

మొదటి రోజు విద్యార్థుల మధ్య చురుకైన భాగస్వామ్యాన్ని పెంపొందించే సరదా ఆటలు, చర్చలు నిర్వహించగా, రిజ్యూమ్ రైటింగ్ మరియు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్ పై సెషన్లు విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించే ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించాయి. పి. రామ్ మనోజ్ విద్యార్థులకు కార్పొరేట్ ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలపై విలువైన సూచనలు అందించారు.

రెండవ రోజు గ్రూప్ డిస్కషన్లు, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించగా, విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ కూడా సేకరించారు. విద్యార్థులు ఈ సెషన్ బోరింగ్గా కాకుండా ఉల్లాసంగా మరియు ఆసక్తికరంగా అనిపించిందని తెలిపారు.ఈ సెషన్లు విద్యార్థుల కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలను మెరుగుపరచడానికి దోహదపడ్డాయి. వర్క్‌షాప్ చివరిగా పి. రామ్ మనోజ్ సర్ గారిని సత్కరించడం ద్వారా ముగిసింది.