calender_icon.png 27 October, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకర్ల దారుణం!

27-10-2025 01:32:16 AM

-వ్యవసాయ రుణాలపై విముఖత 

-2025 రూ.1.87 లక్షల కోట్ల రుణాలివ్వాలని బడ్జెట్‌లో నిర్ణయం 

-ఈ ఏడాది జూన్ వరకు ఇచ్చింది.. రూ. 41,051 కోట్లే.. 

-ఏటా 60 నుంచి 75 శాతం లోపే రుణ లక్ష్యం

-ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కర్షకులు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : వ్యవసాయ రుణాలు అంటేనే బ్యాంకులు ఆమడదూరం పారిపోతున్నాయి. టీ కొట్టు, టిఫిన్ సెంటర్ పెట్టు కుంటే రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న బ్యాంకులు, అన్నదాతల విషయా నికి వచ్చే సరికి విముఖత చూపుతున్నా యి. బ్యాంకులు ఇచ్చే రుణాల్లో 18శాతం వ్యవసాయ సాగుకు, దాని అనుబంధ రంగాల (పౌల్ట్రీ, డెయిరీ, యంత్రాలు ఇత ర రుణాలు )కు 22 శాతం కలిపి మొత్తం 40శాతం రుణాలు  ఇవ్వాలని రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉన్నాయి.

దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) రుణ లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. కానీ, ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఎప్పుడు వంద శాతం పూర్తి చేయలేదు. పంట రుణాలు ప్రతి ఏటా 60 నుంచి 75 శాతం లోపే ఉంటున్నాయి. వీటిలో ఎక్కువగా కాగితాల్లోనే అడ్జెస్ట్‌మెంట్ రుణాలుగానే ఉం టున్నాయి. ముఖ్యమంత్రి లేదా ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో జరిగే ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రైతులకు రుణాలు ఇస్తామని హామీ ఇవ్వడం ఆ తర్వాత వాటిని బ్యాంకర్లు పట్టించుకోవడం లేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పంట రుణాలు అంటే.. రైతుల నుంచి మళ్లీ తిరిగి రావు అనే భావనలోనే బ్యాంకర్లు ఉన్నారు.   

 సరిపోని పెట్టుబడి సాయం..

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడిసాయం అందజేస్తున్నా ..ఆ సొమ్ము సరిపో వడం లేదని రైతులు చెబుతునారు. బ్యాంకులు చిన్న రుణాలు ఇవ్వడానికి ముందుకు రావకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్ర యించక తప్పడం లేదు. పాత రుణాల్లో ఏవైనా కారణాలతో ఒకటి లేదా రెండు ఇన్‌స్టాల్‌మెం ట్స్ చెల్లించకుంటే సామాన్య రైతులను రుణ ఎగవేతదారులుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల భారం పెరగడంతో తీర్చే మార్గం లేక కొందరు ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు.

రూ.15,440 కోట్లు తక్కువగా..

ఎస్‌ఎల్‌బీసీ మినిట్స్ ప్రకారం 2025 వార్షిక బడ్జెట్‌లో అన్ని రంగాలకు రూ. 7.65 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వాటిలో వ్యవసాయానికి రూ. 1.87 లక్షల కో ట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది జూన్ వరకు రూ. 41,051 కోట్ల (25 శాతం) రుణాలు మాత్రమే  ఇచ్చారు. 2024 25 ఆర్థిక సంవత్సరంలో రుణాల లక్ష్యం రూ. 64,940 కోట్లు కాగా,  ఇచ్చింది రూ. 49,500 కోట్లు మాత్రమే. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే రూ.15,440 కోట్లు తక్కువగా ఇచ్చారు. 

బ్యాంకర్లు ఏం చెబుతున్నారంటే..

వ్యవసాయంలో చాలా రిస్కు ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. పంటలకు గ్యారెంటీ ఉండదు, వచ్చిన పంటను అమ్ముకోవడం రైతులకు సవాల్ గానే ఉంటుంది. అకాల వర్షా లు, వరదలు, తుఫాన్లు, కరువు వంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని స్థిరంగా ఉంచడం కష్ట మని, అందువల్ల రైతులకు రుణాలు ఇచ్చి తిరి గి రాబట్టుకునేందుకు  ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కారణాలు చూపిస్తున్నాయి. దీంతో రైతులకు రుణాలు ఇవ్వాలంటే ఒకటి, రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుందని చెబుతున్నారు. రైతులకు భూమి హక్కుపత్రా లు సరి గా లేకపోవడం, భూబదలాయింపుల్లో ఆల స్యం వంటి కారణాలతోనూ రుణాలు అందకపోవడానికి కారణా లుగా కనిపిస్తున్నాయి. 

లక్ష్యంపై నిర్లక్ష్యం..

కొన్ని సమయాల్లో బ్యాంకులు రైతులు అండగా ఉంటున్నప్పటికీ, ఎక్కువ సమయాల్లో రైతులను ఆదుకోవడం లేదని, లక్ష్యాలను చేరుకునే సమయంలో ఈ నిర్లక్ష్యంగా ఉంటున్నా యని రైతులు ఆరోపిస్తున్నారు. అందుకు క్షేత్ర స్థాయిలో బ్యాంకులకు కచ్చితమైన బృందాలు లేకపోవడం, ఫీల్డ్ ఆఫీసర్ల లెక్కలేని తనం, రుణ పరిశీల సామర్థ్యం లేకపోవడం వంటి కారణా లు కూడా రైతులకు అప్పు పుట్టకుండా చేస్తున్నాయి.

మరో వైపు ప్రభుత్వాలు కూడా కొన్ని పంటలను మాత్రమే కొనుగోలు చేయ డం, ఒక వేళ కొనుగోలు చేసినా సకాలంలో కొనుగోలు చేయని పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా వర్షాలు, వరదలతో రైతులు పంటను నష్టపోతున్నారు. దీంతో రైతులు తక్కువ ధరలకే తమ పంటను దళారులకు విక్రయిస్తున్నారు. దీని వల్ల పంట పెట్టుబడికి, అమ్మిన తర్వాత వచ్చిన సొమ్ముకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటు ండంతో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తే.. రైతుకు పెట్టుబడి వ్యయం తగ్గి లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.