27-10-2025 01:20:15 AM
నాగోల్ ఎక్స్ రోడ్డులో విజిబుల్ పోలీసింగ్
ఎల్బీనగర్, అక్టోబర్ 26 : వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఏసీపీ కృష్ణయ్య అన్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఏసీపీ ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్ ఎక్స్ రోడ్డులో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ ప్రమాదాలు, సైబర్ క్రైమ్, సీసీటీవీల ఉపయోగాలు, డ్రగ్స్ నివారణ, మహిళలు, వృద్ధులు, పిల్లలపై జరిగే నేరాలు,
సమాజం పట్ల పౌరుల భాద్యత లను ఏసీపీ వివరించారు, ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని, సమాజంలో నేరాల నియంత్రణపై బాధ్యతగా వ్యహరించాలని సూచించారు. కార్యక్రమంలో నాగోల్ సీఐ మక్బుల్ జానీ, ఎస్త్స్ర ఉమ, ఏఎస్త్స్రలు జంగయ్య, వేణుగోపాల్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.