13 August, 2026 | 3:51 AM

డీ 35 కాలువ మరమ్మతులు పూర్తి

13-08-2026 01:26 AM

చిన్నంబావి ఆగస్టు 12 (విజయక్రాంతి): మండల పరిధిలోని చిన్నదగడ గ్రామ సమీపంలో గోపాల్ దిన్నె రిజర్వాయర్ నుండి వచ్చే డీ35 కాలువ అత్యవసర సైఫాన్ గేటు లీకేజీ కారణంగా  నాలుగు రోజుల పాటు సాగు నీటిని నింపివేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో మండల నాయకులు కొత్త కళ్యాణ్ కుమార్ సారధ్యంలో రెండు రోజుల పాటు శ్రమించి నూతన సైఫాన్ గేటును బుధవారం అమర్చి రైతులకు సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్,శ్రీను,బాలకృష్ణ, శివ మల్లయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ రెడ్డి, లాస్కర్లు తదితరులు పాల్గొన్నారు.