30 March, 2026 | 2:19 AM

డబల్ బెడ్ రూమ్ బస్తీ బాట

30-03-2026 12:00 AM

మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్, మార్చి 29(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్‌పల్లిలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలు తమ సమస్యలను ఈటెల దృష్టికి తీసుకెళ్లారు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం, పార్క్ నిర్మాణం, ప్రభు త్వ పాఠశాల, బస్తీ దవాఖాన, కాంపౌం డ్ వాల్ నిర్మాణం, ఆర్టీసీ బస్సులు కాలనీ లోపలికి వచ్చేలా చూడాలని కోరారు.

అలాగే మంచి నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్ల మెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ తాగునీటి సమస్య అన్ని డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రస్తుతం సరిపడా నీరు అందడం లేదని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ భవనాలపై వాటర్ ప్రూఫింగ్ పనులు చేయాలని, జనాభా ఆధారంగా ఆశ వర్కర్లు, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు.