calender_icon.png 11 December, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తెలతాడు చోరీ నిందితుడికి రిమాండ్

11-12-2025 09:37:47 PM

సిద్దిపేట క్రైం: గత నెల 24న చేర్యాల మండలం ముత్యాల గ్రామానికి చెందిన సోటె నర్సమ్మ అనే మహిళ మెడలో పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు చేర్యాల ఎస్ఐ నవీన్ తెలిపారు. కేసులు సంబంధించిన వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. నర్సమ్మ మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా మంచం మీద కూర్చొని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ ధరించి ఆమె మెడలో ఉన్న 32 గ్రాముల బంగారు పుస్తెలతాడు గుంజుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కర్రి నరేష్ గా గుర్తించారు. అతడు వద్ద నుంచి బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.