11-12-2025 10:03:43 PM
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్..
చివ్వెంల (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపిన ప్రకారం, మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(MCC) అమల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చినా గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు, భారీ సభలు, డీజేలు, సౌండ్ సిస్టమ్‌లు నిషేధించబడినట్లు హెచ్చరించారు. ఎంపీసీసీ అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల ఆనందోత్సవాల పేరుతో ఏ విధమైన ఉల్లంఘనలు జరిపినా తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి–భద్రతలు, ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ నిబంధనలు పాటించడం అత్యవసరమని, నాయకులు, అభ్యర్థులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ నరసింహ విజ్ఞప్తి చేశారు.