calender_icon.png 11 December, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

11-12-2025 09:44:38 PM

మాజీ ఎంపీటీసీ కడియం స్వప్న 

గరిడేపల్లి (విజయక్రాంతి): బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధికమైన ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు, మాజీ ఎంపీటీసీ కడియం స్వప్న అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి పెండెం శోభారాణితో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో సిసి రోడ్లు విద్యుత్తు మురుగు కాలువలు మంచినీటి సమస్యతో పాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని ఆమె ప్రజలను కోరారు. కార్యక్రమంలో పెండెం ధనయ్య గౌడ్,పెండెం వీరయ్య, పెండెం వినోద్, రాజమహమ్మద్, బండ్ల గోపాల్,సుందరయ్య,నగేష్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు