calender_icon.png 11 December, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం

11-12-2025 09:41:55 PM

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్..

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు..

కోరుట్ల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఓట్ల లెక్కింపు పక్రియ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చర్యలు తీసుకున్నారు.

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని మొదటి  విడత ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటికీ, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు ఇప్పుడే విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే లు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  అమల్లో ఉన్నందున ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించేది లేదని, ఉల్లంఘనలు జరిగితే వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని,ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అన్నారు.