11-12-2025 09:58:43 PM
మాగనూరు: స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మాగనూరు మండలంలో వివిధ పార్టీల నాయకులు ముమ్మరముగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో మండలంలో త్రిముఖ పోటీ జరుగుతున్నది. మాగనూరు మండల కేంద్రంలో చతుర్ముఖ పోటీ అభ్యర్థులు జోరుగా ప్రచారం ముమ్మరంగా చేయుచున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, పోటీలో నువ్వా నేనా అనే విధముగా ప్రచారము జోరుగా సాగిస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం రాత్రిపూట మద్యంతో ఓటర్లను ప్రలోభపుర పరుస్తున్నారు.
ఓటర్లకు గ్రామ అభివృద్ధి గురించి హామీలు ఇస్తూ, ఎన్నికల్లో మహిళ అభ్యర్థులు తదితరులు ఇంటింటికి ప్రచారం ముమ్మరముగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ప్రచారానికి కొన్ని గ్రామాల్లో కూలీలకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయిస్తున్నారని ఆయా గ్రామ ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా గెలుపు లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ఇంటింటికి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలోకీ ఓటర్స్ ను కలిసి వారి దగ్గర హామీలు తీసుకుంటున్నారు. ఎన్నికలు జరిగేంతవరకు ఓటర్ మహాశయులకు ఇది ఒక పండుగ వాతావరణం లాగా కనిపిస్తుందని మండల ప్రజలు అంటున్నారు.