15 April, 2026 | 7:57 AM

ఎన్నికల బరిలో 173 మంది అభ్యర్థులు

03-02-2026 10:10 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహ మొత్తం 173 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మంగళవారం నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసింది. టికెట్ ఆశించి ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇతరులతోపాటు  251 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసారు. అందులోనుండి 79 మంది అభ్యర్థులు విత్ డ్రా అయ్యారు. మిగిలిన173  మంది అభ్యర్థులు ఎలక్షన్ బరిలో నిలిచారు. 

పార్టీల వారీగా వివరాలు..

BJP-20, BSP-06 INC-34, MIM-02, BRS-34, AIFB-01, CPI-06, JSP-01, ఇతర రిజిస్టర్ పొందిన పార్టీలు -03, స్వతంత్ర అభ్యర్థులు - 66 ఉన్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. సజావుగా ఈ ప్రక్రియను నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎన్నికల అధికారులను ఆదేశించారు.