23-06-2025 01:38:36 AM
13 ఫీట్ల పొడవు 30 కేజీల బరువు
గోపాలపేట జూన్ 22: వనపర్తి జిల్లా గోపాలపేట మండలం ఓ చెరువులో భారీ కొండచిలువ లభ్యమైంది.ఆదివారం గోపాలపేట శివారులోని హౌసుల కుంట వద్ద ఓ వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ఉడుమును అక్కడున్న కొంతమంది రైతులు వెంటనే హోంగార్డ్ కృష్ణ సాగర్ కి సమాచారం ఇచ్చారు. వెంటనే కృష్ణ సాగర్ అక్కడికి చేరుకొని ఎంతో నేర్పుతో ఆ కొండచిలువను పట్టుకున్నారు.
కొండచిలువ పొడవు 13 ఫీట్లు బరువు 30 కేజీలు ఉన్నట్లు కృష్ణ సాగర్ తెలిపారు. పొడవాటి కొండచిలువ అక్కడ కనిపించడంతో ఆ రైతులు భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ మింగిన ఉడుమును బయటకు తీశారు.
ఆ ఉడుము కూడా సుమారుగా 10 కేజీల బరువు ఉన్నట్లు తెలిపారు. ఎవరు కూడా భయపడవద్దని ఆ రైతులకు కృష్ణ సాగర్ చేతిలో పట్టించి భయం నుంచి విముక్తి చెందించారు. కృష్ణ సాగర్ అంత పెద్ద కొండచిలువను నేర్పుగా పట్టుకోవడంతో రైతులు గ్రామ ప్రజలు అతన్ని అభినందించారు.