అమెరికాలో కారు ప్రమాదం
04-06-2026 12:00 AM
మధుయాష్కీ సతిమణి సుచీయాష్కీకి గాయాలు
హైదరాబాద్/ఎల్బీనగర్, జూన్ 3 (విజయక్రాంతి): అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ భార్య డాక్టర్ సుచీయాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ కుటుంబ సభ్యులు తమ కుమార్తె గగనను మెడిసిన్ ఉన్నత చదువుల నిమిత్తం కాలేజీలో చేర్చేందుకు అమెరికా వెళ్లారు. అ డ్మిషన్ ముగించుకుని బోస్టన్ నగరం నుంచి తిరిగి న్యూయార్క్ పయనమయ్యారు. మా ర్గమధ్యంలో భారీ వర్షం కురుస్తుండటంతో సుచీయాష్కీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు ఫల్టీ కొట్టింది. దీంతో ఆమె పక్కటెముకలు విరిగాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






