4 March, 2026 | 3:14 AM

మాజీ ఎమ్మెల్యే తల్లి మృతి పట్ల కేటీఆర్ సంతాపం

04-03-2026 01:09 AM

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్క జైపాల్ యాదవ్ మాతృమూర్తి గుర్క మంగమ్మ అనారోగ్యంతో మృతిచెందడంపట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సమయంలో జైపాల్ యాదవ్‌కి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదిం చాలని కోరుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు.