25 April, 2026 | 3:41 PM

కత్తితో బెదిరించి కారు చోరీ

26-06-2024 05:20 PM

రంగారెడ్డి : ఓ యువకుడు కత్తితో బెదిరించి కారును దొంగిలించిన ఘటన శంషాబాద్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకుంది. విమానాశ్రయం వద్ద ఓ మహిళ పార్కింగ్ లో ఉన్న తన కారును తీసుకెళ్లేందుకు వెళ్లడంతో అటుగా వచ్చిన యువకుడు కత్తితో బెదిరించి కారును తీసుకెళ్లిపోయాడు. జూన్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.