25 April, 2026 | 5:24 PM

Breaking News

బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •  

ఏసీబీ వలకు చిక్కిన వెల్దండ ఎస్ఐ

26-06-2024 10:48 AM

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వెల్దండ మండల ఎస్సైని వలపన్ని ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తి సాయంతో 50వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా బుధవారం కోర్టులో హాజరుపరచినట్లు కృష్ణ గౌడ్ తెలిపారు. కల్వకుర్తి పట్టణం తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో ఈనెల 17న పేలుడు పదార్థాలను ఎస్ఐ రవి స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై కేసు నమోదు కాకుండా ఉండేందుకు బాధితుడి నుండి 50వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించడంతో ఏసిబి అధికారులు మంగళవారం మధ్యాహ్నం నుండి వలపన్ని రాత్రి 11 గంటలకు ఓ అంబులెన్స్ డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టుకున్నారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ రవిని అరెస్టు చేశారు.