అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లిన కారు
- ఒకే కుటుంబంలో తొమ్మిది మంది దుర్మరణం
- మృతుల్లో ఆరుగురు చిన్నారులు
- మహరాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘటన
ముంబై, ఏప్రిల్ 4:మహారాష్ట్రలోని నాసి క్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమా దం చోటు చేసుకుంది. ఓ కారు బావిలో పడి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యా రు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. అలాగే చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు డిండోరి ప్రాంతానికి చెందిన ఓ కు టుంబం మహారాష్ట్రలోని శివాజీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఫంక్ష న్ ముగిసిన తర్వాత వారంతా కారులో తి రుగు ప్రయాణం కాగా మార్గమధ్యంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
వీరు ప్ర యాణిస్తున్న కారు అదుపు రోడ్డు మీద నుం చి పక్కకు వెళ్లి నేరుగా బావిలో పడిపోయింది. కారులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో కారులోని వారందరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో సహాయక చర్యల్లో తీవ్ర ఆటంకం కలిగాయి. క్రేన్ల సహాయంతో వాహనాన్ని బయటకు లాగడానికి గంటల సమయం పట్టింది.కారులో నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికితీశా రు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో సునీల్ దత్తాత్రేయ దర్గుడే(32), అతని భార్య రేష్మా(30), వారి కుమార్తె 10 ఏళ్ల రాఖీ అలియాస్ గుణవంతి, మేనకోడళ్లు 13 ఏళ్ల మా ధురి, 11 ఏళ్ల శ్రావణి ఉన్నారు.మృతులలో 32 ఏళ్ల ఆశా అనిల్ దర్గుడే, ఆమె కుమారుడు 11 ఏళ్ల శ్రేయాష్, కుమార్తె 14 ఏళ్ల సృ ష్టి, మేనకోడలు 7 ఏళ్ల సమృద్ధి కూడా ఉ న్నారు. బాధితులందరూ ఒకే ఉమ్మడి కు టుంబానికి చెందినవారు కావడం, జరిగిన నష్టం తీవ్రతను మరింత పెంచింది. పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.




