ఎల్డీఎఫ్ పతనానికి కౌంట్ డౌన్
- కాంగ్రెస్, వామపక్షాలు అబద్ధ్దాల కర్మాగారాలు
- శబరిమల రైల్వే ప్రాజెక్టును పక్కన పెట్టేశారు
- తీవ్రవాద శక్తులకు మద్దుతునిచ్చారు
- యూపీఏ కంటే ఐదురెట్లు ఎక్కువ నిధులిచ్చాం
- క్రైస్తవులుండే రాష్ట్రాల్లో అభివృద్ధి చూపించాం
- కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ
తిరువనంతపురం, ఏప్రిల్ 4: ఓటుబ్యాంకు కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రవాద శక్తులకు మద్ధతు ఇస్తున్నాయని, హిందూ, క్రైస్తవ కుటుంబాలను బెదిరిస్తుంటే ఏం తెలియనట్లు నటిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నా రు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన శబరిమల రైల్వే ప్రాజెక్టును పక్కనపెట్టేశాయని విమర్శించారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ పతనా నికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.
కాంగ్రెస్, వామపక్షాలు అబద్ధాల కర్మాగారంగా మారాయని ప్రధాని ఆరోపించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం తి రువల్లలోని జరిగిన బహిరంగ సభలో ప్రధా ని మోదీ ప్రసంగించారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ దశాబ్దాల పాటు అధికారంలో ఉండి రాష్ట్ర, ప్రజల అభివృద్ధిని విస్మరించాయని ఆరోపించారు. కనీస మౌలిక సదుపాయా లు కల్పించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేరళ ప్రజ లు ఓ నిర్ణయానికి వచ్చారని, ఎన్డీయేను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా, ప్రగతికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశా రు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎక్కడా రాజీ పడలేదని, వివక్షకు తావులేదని అన్నారు. యూపీఏ ప్రభుత్వం వెచ్చించిన నిధుల కంటే ఐదురెట్లు ఎక్కువ నిధులను ఎన్డీయే ప్రభుత్వం కేరళ అభివృద్ధి కోసం వెచ్చిందన్నారు.
కేరళ, కశ్మీర్ ఫైల్స్, ధురందర్ కథ అబద్ధమని ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపో యాయరన్నారు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఎ), యూనిఫాం సివి ల్ కోడ్ (యూసీసీ) సవరణలపై భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ము నంబంలో 404 ఎకరాల భూమి తమదేనంటూ వక్ఫ్ బోర్డు వాదనలతో 600 క్రైస్త వ కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
క్రైస్తవులు అత్యధికంగా ఉండే ఏడు రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందని అక్కడ అభివృద్ధి చూపించామన్నారు. కేరళలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే ఇక్కడి అభివృద్ధి కూడా నూతన శిఖరాలకు తాకుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభు త్వం యువతకు ఉపాధి మార్గాలను తెరిచే శబరిమల రైల్వే ప్రాజెక్టును మూలనపడవేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక వ్యాపారాలకు కొత్త ఊపునిస్తుందని, యువతకు ఉపాధి మార్గాలు లభిస్తాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి అడ్డంకులను తొలగిస్తామని ప్రధా ని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.




