సౌందర్య ఉత్పత్తులకు కేరాఫ్ హైదరాబాద్
10-05-2024 02:04 AM
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : సౌందర్య ఉత్పత్తుల వాడకం శరీర తేజస్సును పెంపొందించడమే కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని జావేద్ హాబీబ్ పేర్కొన్నారు. గురువారం నాగోల్‌లోని ఎస్‌వీఎం గ్రాండ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రస్సుగా మారిందని, బ్యూటీ ఉత్పత్తులు, బ్యూటీ కోర్సులకు ప్రాధాన్యతనిస్తూ సెమినార్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ రంగంలో ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తున్నట్లు జియా సొన తెలిపారు.






