24 April, 2026 | 8:31 PM

శివాజీనగర్ అంగన్‌వాడి కేంద్రంలో గర్భవతులకు సీమంతం

24-04-2026 07:00 PM

మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకట్

హుస్నాబాద్: పట్టణంలోని శివాజీనగర్ రెండో అంగన్‌వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ ఏర్పాటు చేసి గర్భవతులకు సీమంతం  నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, 15వ వార్డు కౌన్సిలర్ ఆకుల రజిత మాట్లాడుతూ... అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలు, మూడు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు. ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. గర్భవతులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైనప్పుడు ఆశా కార్యకర్తలకు సమాచారం అందించాలని సూచించారు.