24 April, 2026 | 5:45 PM

రేవంత్‌పై ఫిర్యాదు

10-05-2024 02:02 AM

శ్రీరాముడి అక్షింతలను అవమానించారు

చర్యలు తీసుకోవాలని సీఈఓకు వీహెచ్పీ విజ్ఞప్తి

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అయో ధ్య రాముడి అక్షింతలను అవమానించేలా, హిందువుల మనోభావా లను దెబ్బతీసేలా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌కు విశ్వహిందూ పరిషత్ (వీహె చ్పీ) బాధ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. సీఈవోను కలిసిన వారిలో వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బోజనపల్లి నరసింహమూర్తి, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, కార్యదర్శి శాలివాహన పండ రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.