calender_icon.png 8 November, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో కూలిన కార్గో విమానం

06-11-2025 12:00:00 AM

ఏడుగురి దుర్మరణం

వాషింగ్టన్, నవంబర్ 5: యునైటెడ్ పార్శిల్ సర్వీస్ (యూపీఎస్)కు చెందిన కార్గో విమానం కుప్పకూలిన ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని కెంటకీలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమా దం చోటు చేసుకుంది. కార్గో విమానం విమానాశ్రయం సమీపంలోని రెండు వ్యాపార సంస్థలను ఢీకొట్టడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ తెలిపారు.

ప్రమాదానికి ముందు విమానం ఎడమ రెక్క నుంచి మంటలు రావడం, చిక్కటి పొగ ఆకాశంలో దట్టంగా కమ్ముకున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం మళ్లీ రన్వేపైకి వేగంగా దూసుకువచ్చి కూలి భారీ అగ్నిగోళంగా మారింది. పక్కనే ఉన్న ఫుటేజీలో  దృశ్యాలు రికార్డు అయ్యాయి.