calender_icon.png 8 November, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన కవిత

08-11-2025 03:40:51 PM

హైదరాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని తెంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఎంజీఎం ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడిన ఆమె వారి ఆరోగ్య పరిస్థతి, అక్కడి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ఆగిపోయాయని, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిపై రోగుల ఒత్తిడి పెరిగిందన్నారు. ఆసుపత్రిలో ఔషధాలు, సదుపాలయాలు సరిగా లేవని, వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్న ఏం ఫలితం లేదని కవిత విమర్శించారు.

ఆసుపత్రిని బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పే అని, బీఆర్ఎస్ హయంలో సమస్యలు తీరక.. ఇప్పుడూ తీరకపోతే ఎలా..? అని ప్రశ్నించారు. తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆమె ఎద్దేవా చేశారు. రాజకీయాలు ఉంటే ఎన్నికలు జరిగే చివరి ఏడాదిలో చేసుకుందాం అని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని వ్యాఖ్యానించారు. తన పర్యటనల ద్వారా ప్రజలకు పైసా మేలు జరిగినా తన జన్మ ధన్యమైనట్లే అని కవిత పేర్కొన్నారు.