calender_icon.png 8 November, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వతంత్ర సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది..

08-11-2025 03:02:18 PM

హైదరాబాద్: స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం(Central Government) దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్‌ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు శనివారం గాంధీభవన్(Gandhi Bhavan)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ... మహారాష్ట్ర, హరియాణ ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితం లేదన్నారు. ఓట్ చోరీపై ఇటీవల రాహుల్ గాంధీ మీడియాకు వివరాలు వెల్లడించారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే చిరునామాతో ఎక్కువ మంది ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఓట్ చోరీపై సంతకాల సేకరణ కొనసాగుతోందని నటరాజన్ సూచించారు. హర్యాణాలో 8 సీట్లలో 400 ఓట్ల వ్యత్యాసంతో కాంగ్రెస్ ఓడిపోయిందని నటరాజన్‌ పేర్కొన్నారు.

ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఈసీని గుప్పిట్లో ఉంచుకొని ఓట్లు అవకతవకలకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. ఓట్ల అవకతవకలపై రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని చెప్పారు. హర్యానాలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా బీజేపీ గెలిచిందన్నారు. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని మహేశ్ గౌడ్ ఆరోపించారు. హర్యానాలో ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉన్నాయని చెప్పారు.

పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హర్యానా ఓటర్లుగా చేర్చారని తెలిపారు. బీహార్ లో తమకు బలం లేని చోట.. ఓట్లను బీజేపీ తొలగిస్తోందని వివరించారు. ఈసీని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ.. ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఓట్లు అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 5 కోట్ల సంతకాల సేకరణ జరిగిందని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం వల్లే.. పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని పేర్కొన్నారు. సంతకాల సేకరణ పత్రాలను ట్రక్కుల ద్వారా తీసుకెళ్లి రాష్ట్రపతికి అందిస్తామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.