calender_icon.png 8 November, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమలింగం వద్ద సీఎం పుట్టినరోజు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు

08-11-2025 03:14:40 PM

వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో భీమలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అనంతరం వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని సహదేవ్, కొండూరు భాస్కర్, కాసుల వెంకన్న, జక్క జంగారెడ్డి, మైసోల్లా ప్రవీణ్, సయ్యద్ బాబా, బద్దం సంజీవరెడ్డి పాల్గొన్నారు.