20 May, 2026 | 10:31 AM

కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులు.. ఎస్‌ఐ అరెస్ట్

19-06-2024 12:32 PM

జయశంకర్ భూపాలపల్లి: ఏదైనా సమస్య వస్తే ప్రజలు పోలీసుల దగ్గరకు వెళ్తారు. పోలీసులకు సమస్య వస్తే ఆ నరకం మామూలుగా ఉండదు. ఇలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటుచేసుకుంది. కాళేశ్వరం పీఎస్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భావానీ సేన్ తన స్టేషన్ లోనే పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేసిన ఆరోపణలపై కాళేశ్వరం పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) భవానీ సేన్ గౌడ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాళేశ్వరం పీఎస్ లో అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారించారు. యువతితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గతంలో ఒకసారి ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు.