600 కుక్కలను చంపేశారు!
మందు పెట్టి చంపి, పూడ్చివేత
స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో ఐదుగురు సర్పంచులపై కేసు
కామారెడ్డి జిల్లాలో ఘటన
కామారెడ్డి, జనవరి 14 (విజయక్రాంతి): శాస్త్రీయంగా కుక్కల్ని నిర్మూలించాల్సి ఉండగా మానవత్వం మంట గలిచే విధంగా వ్యవహరించి 600 కుక్కల మృతికి కారకులైన కామా రెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఐదు గ్రామాల సర్పంచులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీధి కుక్కల బెడద ఉన్నదని ప్రజలు సర్పంచ్‌లా దృష్టికి తేవడంతో ఐదు గ్రామాల్లో 600 కుక్కలకు విష ప్రయోగం చేసి చంపి, వాటిని పూడ్చి పెట్టారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధుల దృష్టికి ఈ ఘట న వెళ్లగా వారు మాచరెడ్డి పోలీసులకు ఫిర్యా దు చేశారు.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి భవానిపేట్, పర్దిపెట్, వాడి, పాల్వంచ, బండ రామేశ్వర్‌పల్లి గ్రామాల సర్పంచులపై కేసులు నమోదు చేశారు. దీంతో ప్రాథమికం గా విచారణ జరిపిన పోలీసులు ఐదు గ్రామా ల సర్పంచులపై కేసుల నమోదు చేశారు. పోలీసులు ఆయా గ్రామాల్లో పాతిపెట్టిన స్థలాలలో పశువుల వైద్యులను పిలిపించి పంచనామ నిర్వహించినట్టు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
బయటకు ఎలా వచ్చింది?
విష ప్రయోగంతో 600 కుక్కలను హతమార్చిన ఘటనపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గ్రామాల్లో అంతర్గతంగా బయటకు పొక్కకుండా జరిగిన ఈ ఘటన ఫౌండేషన్ ప్రతినిధులకు ఎలా తెలిసిందన్న ప్రశ్నలు సర్పంచులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలను కుక్కల బెడద నుంచి కాపాడేందుకు చేసిన ఘటన ఒక్కసారిగా తమ మెడకు చుట్టుకోవడంతో ఆ సర్పంచులు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.




