calender_icon.png 31 July, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్ ఓనర్ పై కేసు నమోదు

30-07-2025 10:28:41 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను ఈరోజు ఎస్ఐ ఉపేందర్ చారికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బంది బద్దెనపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా గ్రామ శివారులో ఒక ఇసుక ట్రాక్టర్ B.NO. TG.23.T.0702 గలది ఎదురుగా రాగ ట్రాక్టర్ డ్రైవర్ ను ఇసుక రవాణాకు సంబంధించిన పర్మిషన్ పేపర్స్ అడగగా, డ్రైవర్ అయినా సరుగు సాగర్, తండ్రి అంజయ్య, గ్రామం ఇంద్రనగర్ అతని వద్ద ఎలాంటి ఇసుక రవాణాకు సంబంధించినటువంటి పర్మిషన్ పేపర్స్ లేనందున ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి డ్రైవర్, ఓనర్ పైన కేసు నమోదు చేయడం జరిగిందని తంగళ్ళపల్లి ఎస్ఐ ఉపేందర్ చారి తెలిపారు.