31-07-2025 05:23:41 PM
ప్రతిపాదనలు తక్షణమే రూపొందించాలి
రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్,విజయక్రాంతి): నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే రూపొందించి సమర్పించాల్సిందిగా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఆయన నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అభివృద్ధి పరిచిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు .అంతేకాక డయాలసిస్ కేంద్రానికి వచ్చిన నూతన వైద్య పరికరాలను పరిశీలించారు.అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో ఆసుపత్రి వైద్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.