30-07-2025 10:30:54 PM
బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు మంత్రి తుమ్మల హితవు..
ఖమ్మం (విజయక్రాంతి): రైతుల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకూడదని ఎన్నిసార్లు తాను విన్నవించినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరి మారడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల విషయంలో రాజకీయాలు మానుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకి తుమ్మల హితవు పలికారు.