calender_icon.png 21 November, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతమడక విద్యార్థినులకు జాతీయ స్థాయిలో అవకాశం

21-11-2025 07:47:49 PM

హరీష్‌రావు అభినందనలు

సిద్దిపేట రూరల్: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చింతమడక కేవిఆర్ఎస్ జ్పిహెచ్ఎస్ విద్యార్థినులు మెరిసి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. జింఖానా గ్రౌండ్‌లో జరిగిన పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని జెల్ల అవంతిక క్రాస్‌ కంట్రీ (4 కిలోమీటర్లు)లో బంగారు పతకం, దుంపటి రుత్విక ట్రిపుల్ జంప్‌లో బంగారు పతకం సాధించారు. దీతో ఈ నెల 26–29 వరకు హర్యానా రాష్ట్రం భీవనిలో జరిగే జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత పొందారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్‌రావు విద్యార్థినులను, వారి కోచ్ పిడి వెంకటస్వామిని అభినందించారు. విద్యార్థినుల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారు జాతీయ స్థాయిలో కూడ మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.