22-12-2025 12:00:00 AM
మంథని సీనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి భవాని
మంథని డిసెంబర్ 21 (విజయక్రాంతి): రాజమార్గం లోనే కేసులను పరిష్కారం అవుతాయని మంథని ఇన్చార్జి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి వి భవానీ అన్నారు. ఆదివారం మంథని కోర్టు ప్రాంగణంలో ఆదివారం జాతీయ లోక్ అధాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జీ శ్రీమతి వి భవానీ మా ట్లాడుతూ రాజమార్గం లో పలు కేసులను పరిష్కారం అయతె కోర్టుల కు భారం తగ్గి తీవ్ర మైన నేరాలు సత్వరం పరిష్కారిచవచ్చని, క్షణి కావేశంలో చేసిన నేరాలకు జరిమానాలు, రాజీ ద్వార పరిష్కారం దొరుకుతుం దన్నారు
సివిల్ కేసులలో రాజీ చేసుకున్న సందర్బంలో కోర్టు ఫీజులు తిరిగి ఇవ్వబడుతాయని పేర్కొన్నారు, ఈ లోక ఆధలాతులో 350 కేసులు పరిష్కరించబడ్డాయి అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ శ్రీ మత ఏ సుదా రాణి, ఎపిపి సందీప్ రెడ్డి, బార్ అసోషియేషన్ ఉపాధ్యక్షులు కె రఘోతం రెడ్డి, లోక్ అధాలత్ సభ్యు లు కటుకం శ్రీనివాస్, డి.విజయ్ కమార్, కనుకుంట్ల స్వామి, న్యాయ వాదులు శశిభూషణ్ కాచె, కె వ్యాస్ కుమార్, సిరివెన్నెల, గోదావరిఖని 2వ పట్టణ సీఐ ప్రసాద్ రావు, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూ ర్ ఎస్‌ఐ లు, డేగ రమేష్, రవికుమార్, శ్రీనివాస్, ప్రసాద్, వివిద బ్యాంకుల అధికారు లు, కక్షి దారులు పాల్గొన్నారు