22-12-2025 02:34:48 PM
హైదరాబాద్: నగరంలోని కో లివింగ్ హాస్టల్ లో మరోసారి డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయింది. రాయదుర్గం పరిధి అంజయ్య నగర్ లోని కో లివ్ గెర్నెట్ పీజీలో డ్రగ్స్ దందా కొనసాగుతోంది. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు(Rajendranagar SOT Police) కోలివ్ గెర్నెట్ పీజీలో తనిఖీలు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులు, ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన డ్రగ్స్ పెడ్లర్లు వంశీ దిలీప్, బాల ప్రకాష్ గా గుర్తించారు. వినియోగదారులను హైదరాబాద్ కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్ గా గుర్తించారు. పోలీసులు ముగ్గురు వినియోగదారులకు డ్రగ్స్ టెస్టు నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.