22-12-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, డిసెంబరు 21 (విజయ క్రాంతి): నగరంలోని జ్యోతినగర్ ప్రాంతం లో ప్రతిరోజు మంచినీరు సరఫరా చేయాలని మాజీ కార్పొరేటర్ గందె మాధవి కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రపు ల్ దేశాయ్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలకవర్గం ఉన్న సమయంలో ప్రతిరోజు మంచి నీటి సరఫరా అయ్యేదని తెలిపారు. జ్యోతినగర్ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు ము న్సిపల్ మంచినీటిపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. వెంటనే జ్యోతినగర్ ప్రాంతంలో ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేయాలని కోరారు.