calender_icon.png 22 December, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక బాధతో ఆత్మహత్య

22-12-2025 12:00:00 AM

చేగుంట, డిసెంబర్ 21 :చేగుంట గ్రామానికి చెందిన ఏళ్దాం శ్రీనివాస్ (45) గత కొన్ని రోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతూ ఈనెల 10న అర్ధరాత్రి సమయంలో ఇంట్లో బాత్రూం లో గల యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు చేగుంట పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి ఏళ్దాం బాలేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.