22 May, 2026 | 7:35 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

పదేండ్లలో 13 కేసులు!

22-08-2024 12:00 AM

‘స్వరాష్ట్రం వస్తే తెలంగాణ సమాజం అభివృద్ధివైపు అడుగులు పడుతాయని అనుకున్నాను.. వ్యాపారం చేసుకుంటూ కుటుంబ జీవనాన్ని నడిపించేవాడ్ని. ఉద్యమ సమయంలో వ్యాపారాన్ని పట్టించుకోకుండా ఉద్యమమే ఊపిరిగా బతికాను. ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఆశించినంత మేరకు అభివృద్ది జరగలేదు’ అని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జీటీ కృష్ణముదిరాజ్ తన అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారు. 

 మహబూబ్‌నగర్, విజయక్రాంతి : తెలంగాణ అనే పదం నన్ను ఇంట్లో నిలకడగా కూర్చొనివ్వకుండా చేసే ది. మాది మద్యతరగతి కుటుంబం. బోకుల ఇంట్లో ఉండి..యాసిడ్, ఫినైల్ తయారు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటు వచ్చేవాణ్ని. స్వరాష్ట్రం వస్తేనే బాగుపడుతామని ప్రొఫెసర్ జయశంకర్‌సార్ చెప్పిన మాటలు నా మనస్సులో నాటుకుపోయాయి. ఇక ఏలాగైనా తెలంగాణ సాధించుకోవాలనే తపన నాలో గట్టిగా పెరిగింది.

చేస్తున్న వ్యాపారానికి స్వస్తి పలికి అప్పట్లోనే 2009 సంవత్సరంలో ఎంపీగా ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడంతో అందరం కలిసి గెలిపించుకున్నాం..అప్పటి నుంచి కేసీఆర్‌తో కృష్ణ అని పేరు పెట్టి పిలుపించుకునే అతి కొద్దిమందిలో నేను ఒకడ్ని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే  జీవితాలు బాగుపడతాయని అన్నీ వదిలేసి రాష్ట్ర ఏర్పాటు కావాలనే లక్ష్యంతో ఉద్యమం కోసం 24 గంటలు పనిచేశాను. ఇప్పుడు అదంతా తలుచుకుంటే బాధేస్తున్నది. ఇంత పోరాటం చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

పోలీసు మెట్లు ఎక్కని రోజూ లేదు!

ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం ఎవరైన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిస్తే చాలు.. వెంటనే అరెస్టులు చేసి స్టేషన్‌లో పెట్టేవాళ్లు. ఆ రోజులను తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రాత్రి, పగలు బేధం లేకుండా పోలీసోళ్ళు ఇంటి చుట్టూ తిరిగి ఎ ప్పుడు పడితే అప్పుడు స్టేషన్‌కు తీసుకుపోయి వారి ఇష్టం వచ్చినప్పుడు వదిలేసే వాళ్లు. ఉద్యమంలో సకల జనుల సమ్మే, మిలియన్ మార్చ్.. ఇలా ప్రతి ఆందోళన కా ర్యక్రమంలో నా వంతు బాధ్యతగా నిర్వహించాను.

ఉద్యమ సమయంలో ఎలాంటి లాభ పేక్ష లేకుండా శ్రమించాను. ఉద్యమ సమయంలో నమోదైన కేసుల కోసం మొన్నటి వరకు కోర్టు చుట్టూ తిరిగా ను. ఈ మధ్యకాలంలో  ఆ కేసులకు ముగిం పు పడింది. నా జీవితం అంత ఉద్యమ కోసమే బతికాను. సొంతంగా కుటుంబం కోసం సమయం కే టాయించలేకపోయాను. ఉద్యమం.. ఉద్య మం అంటూ తిరిగాను.. నా కల సాహకారం అయింది. కానీ నా జీవితంలో ఎలాంటి మా ర్పు రాలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ఏ చిన్న పదవి, ఉపాధి కూడా నన్ను వరించలేదు. ఉద్యమం నాకు పోలీసు మెట్లను మాత్రమే మిగిల్చింది. 

గుర్తింపు కూడా కరువైంది!

నాలాంటి ఉద్యమకారులపై ఎన్నో కేసు లు పెట్టారు. ఎక్కడ భయపడకుండా కోర్టు చుట్టూ తిరిగాం. గత సర్కారు కనీసం ఉద్యమకారులకు గుర్తింపుకు కూడా నోచు కోలేదు. ఒక్కొసారి ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు కండ్ల ముందు ఉన్నత స్థాయి లో నిలబడుతున్నారు. నా జీవితం అంత ఉద్యమం కోసం త్యాగం చేసుకుంటూ బతికాను. నాలాంటి చాలామంది ఉద్యమకారు లకు గుర్తింపు కూడా గత ప్రభుత్వంలో ల భించలేదు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభు త్వం ఉద్యమకారులను గుర్తించి.. వారికి కుటుంబాలకు సరైన న్యాయం చేస్తుందని భావిస్తున్నాను.

జీటీ కృష్ణముదిరాజ్, ఉద్యమకారుడు

టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా చేశా..

సొంత రాష్ట్రం వచ్చింది కదా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవించొచ్చు అనుకున్నాను. 2009 నుంచి 2016 సంవత్సరం మధ్యకాలంలో నేను మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశాను. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది కదా ఏదైన నామినేటేడ్ పదవి రాకుండా ఉంటుందా అనుకున్నాను? నా పేరు కూడా మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్‌తో నాకున్న గుర్తింపే నన్ను మరింత వెనక్కి నెట్టింది.

‘అది ఇస్తాం.. ఇది ఇస్తాం’.. అంటూ కాలయాపన చేసి నన్ను దూరం చేసిండ్రు. గడిచిన పది సంవత్సరాల కాల వ్యవధిలో నాపై 13 కేసులు పెట్టిండ్రు. ఆ కేసులను ఎదుర్కొంటు నిజాయితీగా జీవనం సాగిస్తున్నాను. ఎన్నోమార్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పోలీస్‌స్టేషన్లకు పిలిచి వార్నింగ్‌లు ఇచ్చారు. ఉద్యమం సమయంలో అందరితో కలిసి పోరాటం చేశాను. అదే ధైర్యంతో ఎవరికీ భయపడకుండా.. నిజయితీగా జీవించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. అలాగే జీవిస్తున్నాను కూడా..